అనంతపురం ప్రభుత్వ ఐటిఐ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు హాజరు శాతం తక్కువ ఉందని, భయాందోళనకు గురి చేస్తూ, విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులతో అసభ్యంగా మాట్లాడుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎల్ఐసి పాలసీ కట్టాలని ఒత్తిడికి గురిచేస్తున్నటువంటి ఈశ్వరయ్యని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేసారు.