ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఐఎఎస్, జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ లు శనివారం ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక జెఎన్టీయులో జరుగుతున్న స్నాతకోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు గవర్నర్ శనివారం అనంతపురం చేరుకున్నారు. రైలు మార్గంలో విచ్చేసిన గవర్నర్ కి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు స్థానిక రైల్వే స్టేషన్ లో స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం అందజేశారు.