అనంతపురం జిల్లా స్థాయిలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మెరుగైన సేవలు అందించిన డీఎంఅండ్ హెచ్ఓ ఈబి. దేవికి మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. అలాగే పెరేడ్ గ్రౌండ్ లో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలో వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన శకటానికి రెండవ బహుమతి లభించింది.