కూటమి పాలనలో సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ. 100 రోజుల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కు. అవినీతిలో ముందుకు వెళ్లిందని విమర్శించారు. ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమవుతున్నా పెట్టుబడి సాయం అందలేదని అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా మట్టి, ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.