అగ్నిమాపక సిబ్బంది వారోత్సవాలు మంగళవారం ప్రారంభమైనట్లు ఆ శాఖ పోలీస్ అధికారి లింగమయ్య తెలిపారు. అనంతపురంలోని టవర్ క్లాక్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. అగ్ని ప్రమాదంలో ఏ విధంగా నివారించాలో ప్రాక్టికల్గా చేసి చూపించామన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.