జిల్లాలో ఉత్పత్తిదారుల సంఘాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టరు వినోద్ కుమార్ భరోసా ఇచ్చారు. కలెక్టరేట్లోని రెవెన్యూభవన్ లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వివిధశాఖల అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రదర్శనకు ఉంచిన పలు ఉత్పత్తి వస్తువులను చూసి ఆయన ఉత్పత్తిదారులను అభినందించారు. అనంతరం సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ ఉత్పత్తిదారుల సంఘాల సేవలు అబినందనీయమన్నారు.