అనంతపురంలో దొంగల ముఠా అరెస్ట్

59చూసినవారు
అనంతపురంలో దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం జిల్లాలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు అర్బన్ డీఎస్పీ వెంకటేసులు తెలిపారు. నిందితులు ఆత్మకూరు, శింగనమల, నార్పల, అనంతపురం రూరల్ మండలాల్లో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్