గౌనీపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన ప్రధానోపాధ్యాయులుగా పి విజయమ్మ బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం నూతన ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆమెకు పూలమాలవేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, పాఠశాల పూర్వ విద్యార్థి మల్లెల రమేష్, తదితరులు పాల్గొన్నారు.