గుంతకల్లులోని ఎస్ఆర్కే మున్సిపాలిటీ స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ మెటీరియల్ ను 2వ వార్డు కౌన్సిలర్ మెహారున్నిసా, టీడీపీ మండల ఇన్ చార్జ్ నారాయణస్వామి చేతుల మీదుగా బుధవారం అందజేశారు. పదో తరగతి విద్యార్థులు బాగా చదివి పరీక్షలు బాగా రాయాలని సూచించారు. విద్యార్థులు ఇష్టంగా చదవాలని తెలిపారు. అనంతరం సుమారు 70 మంది విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులను అందించారు.