జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. బుధవారం పామిడి మండలం రామగిరి గ్రామ సమీపంలో వర్షం దంచి కొట్టింది. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పది రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు మారిన వాతావారణంతో ఉపశమనం పొందారు. గాలులు భీకరంగా వీస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు, కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.