అనంత: ఎస్కే యూనివర్సిటీలో ఫూలే వర్ధంతి వేడుకలు

50చూసినవారు
అనంత: ఎస్కే యూనివర్సిటీలో ఫూలే వర్ధంతి వేడుకలు
మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గురువారం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎస్కేయూ రిజిస్ట్రార్ డాక్టర్ రమేశ్ బాబు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఫూలే విద్యాభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డా. సోమశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణుడు, బీసీ ఉద్యోగ సంఘ నాయకులు లక్ష్మణరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్