అనంతపురం నగర శివారులో గుర్రాల రథం ఆకృతిలో ఉండే అద్భుతమైన ఇస్కాన్ శ్రీ రాధా పార్థసారథి ఆలయ 18వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈనెల 10న నిర్వహించనున్నారు. ఇస్కాన్ సభ్యులు మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీ త్రయోదశి నాడు ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.