కళ్యాణదుర్గం: అటెండర్ ను చెప్పుతో కొట్టిన ఎక్సైజ్ సీఐ

83చూసినవారు
అటెండర్ ను చెప్పుతో కొట్టిన కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా బాను. తన పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారంటూ అటెండర్ పై ఆగ్రహం. తనకేం తెలియదని చెబుతున్నా వినకుండా దాడి. అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‍ లో రెండు రోజుల క్రితం జరిగిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి సదరు సీఐ ప్రతి నెలా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు. ఇదే విషయంపై అతను ఎక్సైజ్ ఉద్యోగుల సంఘానికి ఫిర్యాదు చేయగా మాట్లాడేందుకు వచ్చిన వారి ముందే చెప్పుతో కొట్టినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్