కంబదూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హనుమంత రాయుడు బదిలీపై వెళుతుండడంతోవెళ్ళుతుండడంతో శుక్రవారం విద్యార్థులు తమ ఉపాధ్యాయుడు ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ గురువు అన్న పదమే ఎంతో గౌరవనీయమైనది. విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దే వారి సేవ అజరామరణం. అలాంటి వ్యక్తులు బదిలీపై వెళ్తుంటే ఏదో కోల్పోతున్నామన్న బాధ కలగడం సహజమే అన్నారు.