న్యాయవాది శేషాద్రి మృతికి కారణమైన త్రీ టౌన్ సీఐ శాంతి లాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అనంతపురంలో న్యాయవాదులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మూడు రోజుల క్రితం న్యాయవాది శేషాద్రి మృతి చెందడానికి సీఐ శాంతిలాల్ కారణమని ఆరోపించారు. పట్టణంలోని డీఐజీ కార్యాలయం వరకు న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు.