తుంగభద్ర జలాశయానికి బుధవారం వరద నీరు పోటెత్తింది. తాజాగా అధికారులు 10 క్రస్ట్ గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలోకి ఇన్ ఫ్లో 44, 364 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 30, 419 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 105. 788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101. 77 టీఎంసీల నీరు నిల్వ ఉంది.