అనంతపురం నగరంలోని ఆహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ నివాసంలో శుక్రవారం 14 నియోజకవర్గాల సమన్వయకర్తలతో నియోజకవర్గ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అహుడ ఛైర్మన్ టీసీ వరుణ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశా నిర్దేశం చేశారు.