అనంతపురం పట్టణంలో అన్న క్యాంటీన్లను రాష్ట్ర మంత్రి ప్రారంభించారు. గురువారం సాయంత్రం నగరంలోని మూడు అన్న క్యాంటీన్లను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కలెక్టర్ వినోద్ కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి చిన్నారులకు అన్నం తినిపించారు. దసలవారీగా రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లను విస్తరిస్తామన్నారు.