మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటియుసి

70చూసినవారు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటియుసి
అనంతపురం నగర పాలక సంస్థ కమీషనర్ నాగరాజును ఎఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్ గౌడ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. నగర పాలక సంస్థలో దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఈపిఎఫ్, ఈఎస్ఐ, బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్