నార్పలలోని అంబేడ్కర్ నగర్లో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కుమారుడు చిన్న శివయ్య, తండ్రి పెద్ద గంగయ్యపై రోకలిబండతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన గంగయ్యను అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.