14న జాతీయ లోక్అదాలత్

54చూసినవారు
14న జాతీయ లోక్అదాలత్
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 14న జాతీయ లోక్అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి. శ్రీనివాస్ తెలిపారు. అన్ని కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న మోటార్ వాహనాల ప్రమాద కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగ్గ క్రిమినల్ కేసులు, ప్రిలిటిగేషన్ కేసులను జాతీయ లోక్ అదాలత్ లో రాజీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్