రాష్ట్రం లో ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రూపొందించాలని ఏపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. అనంతపురం లో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు మరియు ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉన్నప్పుడే ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని అన్నారు. కానీ కొందరు రాజకీయనాయకులు తమ ప్రాభల్యం చూపించుకోవడానికి ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించడం సరి కాదన్నారు.