వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అనంతపురంలో నిన్న జరిగిన నిరసన కార్యక్రమంలో, పాలస్తీనా జెండాను భారత జాతీయ పథకంపై ఎగురవేయడం పట్ల బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై బీజేపీ నాయకులు అర్బన్ సబ్ డివిజినల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ను సోమవారం కలిసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్టను దిగజారుస్తాయని బీజేపీ నేతలు పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.