అనంతపురంలో పోలీసుల భద్రత కట్టుదిట్టం

75చూసినవారు
అనంతపురంలో పోలీసుల భద్రత కట్టుదిట్టం
అనంతపురంలో సోమవారం పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో పోలీసులు బందోబస్తు నిర్వహించడంతోపాటు ప్రత్యేక నిఘా వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అలాగే నగరంలోని 1 టౌన్, 2 టౌన్ పోలీసులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్