అనంతపురం క్లబ్‌లో గురువారం ఆర్ట్స్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మురళీధర రావు, ఆర్ట్స్ కాలేజ్‌తో తన అనుబంధాన్ని ఆధారంగా తీసిన లఘు చిత్రం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 17వ తేదీ ఉదయం 10: 30 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఈ లఘు చిత్రం ప్రదర్శించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మశ్రీ, జనసేన పార్టీ నాయకులు భవాని రవికుమార్ తదితరులు హాజరవుతారు.