అనంతపురం నగరంలో విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపడుతున్న కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు టౌన్-2 సబ్ డివిజన్ డీఈఈ శ్రీనివాసులు తెలిపారు. జన చైతన్య కాలనీ, లింగమయ్య కాలనీ, జనశక్తి నగర్, ప్రశాంతి నగర్, నారాయణపురం, పీటీసీ రోడ్డు, 1వ, 2వ రోడ్డు పరిధిలోని ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.