అనంతపురం జిల్లా లో గత 24 గంటల్లో వర్షపాతం వివరాలు

68చూసినవారు
అనంతపురం జిల్లా లో గత 24 గంటల్లో వర్షపాతం వివరాలు
అనంతపురం జిల్లాలో 50.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ మంగళవారం తెలిపారు. కనేకల్లో 10.4, పుట్లూరులో 9.4, నార్పల 9.2, గుత్తి 7.3, ఉరవకొండ 6.4, బుక్కరాయసముద్రంలో 1.2 మి.మీ. మేర వర్షం పడిందని చెప్పారు. నేడూ జిల్లాలో వర్షం పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్