తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడినట్లు తేలిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమలలో నిబంధనలు పాటించలేదని విమర్శించారు. తిరుమల అంటే వైసీపీ ప్రభుత్వానికి గౌరవం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో టీటీడీని మరింత అభివృద్ధి చేస్తామని పయ్యావుల పేర్కొన్నారు.