సోమందేపల్లి మండలం నాగినాయనిచెరువు గ్రామంలో పారిశుధ్యం కరువైైంది. గుడికి వెళ్ళే దారి బురదమయంగా మారడంతో గ్రామస్థులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా రోడ్డు బాగుపడలేదని, అధికారులు చర్యలు తీసుకోలేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి పల్లెలో పండుగ జరపాలని సీఎం ఆదేశాలు జారీ చేసినా కూడా పంచాయితీ అధికారులు నాగినాయనిచెరువు గ్రామాన్ని పట్టించుకోవడం లేదన్నారు.