అనంతపురం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో శుక్రవారం సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్ పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం కృషి చేసిన వ్యక్తి సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు జడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, పలువురు జడ్పీ అధికారులు పాల్గొన్నారు.