నార్పలలో వరుస చోరీలు.. ముగ్గురు దొంగలు అరెస్ట్

80చూసినవారు
నార్పలలో వరుస చోరీలు.. ముగ్గురు దొంగలు అరెస్ట్
నార్పలలో ఇటీవల చోరీలకు పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జరిపిన విలేకరుల సమావేశంలో సీఐ కౌలుట్లయ్య, ఎస్సై సాగర్ ఈ వివరాలు వెల్లడించారు. ఎస్పీ జగదీశ్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన వాహన తనిఖీలో ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దొంగలు చాకలవీధి, నార్పల క్రాస్‌లో చోరీలకు పాల్పడ్డారని ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్