సీపీఎం ఆలిండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ ఎస్కే యూనివర్సిటీలోని మహాత్మ జ్యోతిరావు పూలే భవన్ లో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్కే యూనివర్సిటీ రెక్టార్ వెంకట నాయుడు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఏ చంద్రశేఖర్, మాజీ రిజిస్ట్రార్, న్యాయ శాస్త్ర ప్రొఫెసర్ పుల్లారెడ్డి హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.