అనంతపురంలో డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు

65చూసినవారు
అనంతపురంలో డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు
ఏపీ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ -2024 పోటీలు డిసెంబర్ 1 నుంచి రామచంద్ర నగర్ లో ఉన్న సెయింట్ ఆగస్టనీస్ పాఠశాలలో నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రవిరాజు శుక్రవారం తెలిపారు. ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి చెస్ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. అండర్-8, 10, 12, 14 బాల బాలికలకు క్యాటగిరీల్లో పోటీలు ఉంటాయని, విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్