విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటంలో ఎన్ని అరెస్టులకైన సిద్ధమని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు చిరంజీవి, ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక మధు అన్నారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద ప్రజా దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షను శుక్రవారం అర్ధరాత్రి వన్ టౌన్ పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.