ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో శుక్రవారం 32, 248 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 101. 773 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. వివిధ కాల్వలు 33, 096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.