గుత్తి ఎక్సైజ్ నూతన సీఐగా ఉమాదేవి శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సీఐగా పనిచేస్తున్న మోహన్ రెడ్డి మడకశిర ఎక్సైజ్ మొబైల్ పార్టీ సీఐగా బదిలీ అయ్యారు. అనకాపల్లిలో ఎక్సైజ్ సీఐగా పని చేస్తున్న ఉమాదేవిని ఇక్కడికి బదిలీ చేశారు. నూతన సీఐ గా బాధ్యతలు స్వీకరించిన ఉమాదేవిని ఎస్సైలు అస్లాం బేగ్, గోపాల్, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.