ఏపీ ప్రభుత్వ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ జిల్లా కేంద్రానికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె బుధవారo సాయంత్రం అనంతకు చేరుకుంటారు. ఈ విషయాన్ని ఐసీడీఎస్ పీడీ నాగమణి ధ్రువీకరించారు. 11న రాత్రి 7:30 గంటలకు అనంత ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకుంటారు. 12న ఉదయం 9 గంటలకు విలేకరుల సమావేశం, 10 గంటలకు ప్రభుత్వ సర్వజన వైద్య ఆవరణలో ఉన్న సఖిశాల కేంద్రంలో బాధితులతో మాట్లాడతారు. 11 గంటలకు హత్యకు గురైన బాలిక తన్మయి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత 2 గంటలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు బయలుదేరి వెళ్తారు.