పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఉమ్మడి అనంత జిల్లాలో పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మంగళవారం రాత్రి కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాప్తాడు మండలానికి చెందిన మహానందరెడ్డి, అనంతపురం రూరల్ మండలానికి చెందిన శివారెడ్డి, కళ్యాణదుర్గం మండలానికి చెందిన నరేంద్ర, రామగిరి మండలానికి చెందిన పొట్టే రమేశ్, కురుబ ముత్యాలు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.