అనంతపురంలో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

79చూసినవారు
అనంతపురంలో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
అనంతపురం రూరల్ పరిధిలోని ఇటుకలపల్లి గ్రామంలో శుక్రవారం వంశీ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్