ధర్మవరంలోని 25వ వార్డు పార్థసారథి నగర్ కు చెందిన 30 వైసీపీ కుటుంబాలు శుక్రవారం జనసేనలో చేరాయి. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. చిలకం మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరినట్లు పేర్కొన్నారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.