ధర్మవరం జాబ్ మేళాలో 52 మందికి ఉద్యోగాలు

59చూసినవారు
ధర్మవరం జాబ్ మేళాలో 52 మందికి ఉద్యోగాలు
ధర్మవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ జేవీ సురేశ్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఎంప్లాయిమెంట్, సిడాప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.
112 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా 52 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.

సంబంధిత పోస్ట్