ధర్మవరంలో ఈనెల 18న బీసీ సభ నిర్వహిస్తున్నట్లు చేనేత రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ తెలిపారు. బుధవారం బీసీ నాయకులతో కలిసి ధర్మవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలంతా ఏకమై గత ఎన్నికల్లో బీసీ కులానికి చెందిన సత్య కుమార్ యాదవ్ని ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. అందరం ఏకమైతే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.