బత్తలపల్లి మండలం రాఘవంపల్లి చెరువు, నార్సింపల్లి చెరువులకు అధికారులు, బీజేపీ నాయకులు మంగళవారం నీటిని విడుదల చేశారు. మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం ధర్మవరం బ్రాంచ్ కెనాల్ వద్ద ఇరిగేషన్ అధికారులు మంత్రి పీఏ హరీశ్ బాబుతో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ నీరు రైతులకు, పాడిపంటలకు మేలు చేసేందుకు తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు.