బత్తలపల్లి మండలం అప్పరా చెరువు గ్రామానికి చెందిన భార్యాభర్తలు 18 నెలల చిన్నారితో కలిసి గురువారం ద్విచక్ర వాహనంపై ధర్మవరం నుండి అప్రా చెరువుకు బయలుదేరారు. మార్గ మధ్యలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడగా వారిని స్థానికులు చికిత్స నిమిత్తం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందగా తల్లిదండ్రులైన నరసింహులు మణికంఠేశ్వరి, చికిత్స పొందుతున్నారు.