ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ హామీ మేరకు గురువారం బత్తలపల్లి, నర్సింపల్లి చెరువులకు పీఏబీఆర్ కుడి కాలవ ద్వారా నీరు వదిలారు. దీంతో రైతులు, ఆయకట్టు సమీప బోరు బావుల్లో భూగర్భజలాలు పెరుగుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో తాగునీరు, సాగు నీరుకు ఇబ్బందులు ఉండవని అన్నదాతలు అభిప్రాయపడ్డారు.