ధర్మవరంలో బీజేపీ నాయకులు, కార్యకర్తల బైక్ ర్యాలీ

574చూసినవారు
ధర్మవరం రూరల్ పోతుకుంట సర్పంచ్ అంగజాల నాగమణి, ఆమె భర్త అంగజాల రాజా అనుచరులు నేడు బీజేపీలో చేరనున్నారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ, డప్పు కొడుతూ యువకులు చిందులు చేశారు. మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం వద్ద నుంచి గాంధీ నగర్, కళా జ్యోతి సర్కిల్, కాలేజ్ సర్కిల్, పోతుకుంట వరకు ర్యాలీ సాగింది.

సంబంధిత పోస్ట్