ధర్మవరంలోని లక్ష్మీ చెన్నకేశవపురం వద్ద నిర్మాణాలను కూల్చివేసిన ఘటనపై వన్ టౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ. తమ నిర్మాణాలను కూల్చివేశారని ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేంద్ర ఫిర్యాదు చేశారని చెప్పారు. దీంతో బీజేపీ నాయకులు సోమశేఖర్, ఎం. నాగరాజుతో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.