వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మవరం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, కొత్తపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేసి వారిని ఆశీర్వదించారు.