ధర్మవరం మండలం కునుతూరులో ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సివిల్ రైట్స్ డే గురువారము నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన శ్రీ సత్యసాయి ఎస్పీ రత్న మాట్లాడారు. ప్రజల మధ్య అసమానతలు తొలగిపోయినప్పుడే సామాజిక వివక్ష తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు. నిరక్షరాస్యత పేదరికంతో వెనుకబడిన ప్రజలకు పౌర హక్కుల పరిరక్షణ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.