ధర్మవరం: రాష్ట్ర స్థాయిలో మెరిసిన పేద విద్యార్ధిని

70చూసినవారు
ధర్మవరం: రాష్ట్ర స్థాయిలో మెరిసిన పేద విద్యార్ధిని
ధర్మవరం పట్టణంలోని వాసవి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సి. ఈ. సి చదువుతున్న విద్యార్ధిని కుమావత్ రుచిత బాయి శనివారం విడుదలైన ఏపీ ఇంటర్ ఫలితాల్లో 487/500 మార్కులు సాధించి సత్తా చాటారు. విద్యార్ధిని రూచిత బాయి 6 నెలల క్రిందట తండ్రిని కోల్పోగా, తల్లి కూలీ పనులు చేసుకుంటూ విద్యార్ధిని చదివించింది. మొక్కవోని దీక్షతో విద్యార్థి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. ప్రిన్సిపల్ ఈశ్వరయ్య విద్యార్ధినినీ అభినందించారు.

సంబంధిత పోస్ట్